Thursday, 16 April 2015

విష్ నెం :6(సాన్వి )

విష్ నెం :6
''చిట్టి తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు ''
సాన్వి ఒక సరిగమ
మాకు  సంగీతాలాపనే ప్రతి రోజూ
సాన్వి ఒక ఇంద్రజాలం
మంత్రముగ్దులమే నీ మాయలో
సాన్వి ఒక తర్కం
ఎవ్వరికీ అర్ధంకాని చమత్కారం నీది
సాన్వి ఒక ఆకర్షణ
నువ్వుంటే మాకు ఒక గురుత్వాకర్షణ
సాన్వి ఒక ప్రేమనిధి
తరిగిపోని  అభిమానాల నిక్షేపం
సాన్వి ఒక తళుక్కుమనే తార
చిన్ని చిన్ని సొగసుల సితార
సాన్వి ఒక సందడి
అల్లరితో మనసు గెలిచును తన వైఖరి
సాన్వి ఒక సంతోషం
చిరునవ్వుతో ప్రశ్నించే సుగుణం
సాన్వి ఒక అక్షయపాత్ర
ఆప్యాయత అనురాగాల కోట
సాన్వి ఒక చిన్నారి దేవత
అందరికీ ఇష్టమైన అందాల రాకుమారి










Saturday, 11 April 2015

విష్ నెం :5(బంగారుతల్లి )

విష్ నెం :5
చిన్నితల్లి  చిట్టితల్లి ఓ బంగారుతల్లి 
నీ  చిన్నినవ్వే మాగ్నేట్ లాగా మము లాగేస్తుందే 
నీ చిన్నిరూపం మాకు అపురూపం 
నీ చిట్టిపలుకే మాకు వేదాంతం 
నీ బుడి బుడి అడుగులలో భూగోళం దాగిఉంది 
నీ చిట్టి చిట్టి కన్నులలో ఆమని అందముంది 

కాలమే జపం చేస్తుంది నీ రాకకోసం 
అందమే అలక పెడుతుంది నీ కోసం 
అల్లరి మారాం చేస్తుంది నీతో జత కట్టి 
ఆనందం హంగామా చేస్తుంది నీ నవ్వు చూసి 
అంతరాయం ఉండని ఆహ్లాదం నువ్వు 
మా గుండెలో సరదాలే ప్రతీ రోజూ 
అల్లరి పిల్ల ,రాకాసి పిల్ల 
అందరికీ నువ్వే కావాలి మల్లా మల్లా 








విష్ నెం :4(B.N.R)

విష్ నెం :4
ఆయన విద్య ,వైద్యం .................... వంట
అయన హస్తం చేసేది వంట .... ఆయనకు తెలిసిన శాస్త్రం వంట
చిన్నతనం నుంచి నేటి వరకు అయన వృత్తి ,ప్రవృత్తి వంటే
ఎంతో ఇష్టంగా నేర్చుకుంటానికి ముందుంటారు
ఏంతో మందికి నేర్పించి కొన్ని వందల మందికి జీవనం కల్పించారు
ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం అయన నైజం
చిరునవ్వుని చిందిస్తూ పలకరించటం అయన సహజ గుణం
అందరిలా కాదు అందరిలో ఒకరిలా ముందుంటారు
అందుకే ఈ రోజు A. P . TOURISM లో Best  chef  గా అవార్డు తీసుకున్నారు
అంతే కాదు అందరు మెచ్చే ఉత్తమ నాయకుడు వీరు
V.I.P లకు సైతం ఈయనంటే ఒక అభిమానం
ఒక్కసారి వీరి పరిచయం పొందిన వారు వారి స్నేహాన్ని వదులుకోలేరు
ఎక్కడున్నా వీరి ప్రత్యేకతే వేరు ... అందుకే అంచెలంచలుగా ఎదగగలిగారు
కష్టాన్ని నమ్మిన వ్యక్తి ,శ్రమను మరువని మనిషి
ఏ  గుర్తింపుని ఆశించని వారు అందుకే ఇంతలా రాణించ గలిగారు
తన జీవిత గమనంలో సంపూర్ణత్వాన్ని సాదించారు