Monday, 20 April 2026

Birthday Song to Saanvika

 పల్లవి:

ఓ చిట్టితల్లి మా చిన్నారి తల్లి నువ్వేలే మా జాబిల్లి
నువ్వొక సరిగమ మా ప్రేమ చిరునామా అందాల బంగరు బొమ్మా

నువ్వుంటే సందడి సంతోషమే వెలువడి
మా హృదయమంతా ముడిపడి
సాన్వి ఓ ఓ సాన్వి హాపీ హాపీ బర్త్ డే //2//


చరణం 1:

అరుదైన అమ్మవు చిన్నారి అమ్మవు మా అందరి ఇంటి పెద్దవు
చదువుల సరస్వతివి నువ్వు అక్షరాల అల్లికవు

నువ్వు హాయిగా ఉండాలి ఎప్పుడూ
నువ్వు మా కోసం చిన్న చిరునవ్వు ఇవ్వు
సాన్వి ఓ ఓ సాన్వి హాపీ హాపీ బర్త్ డే //2//


చరణం 2:

సుగుణాల గుమ్మవు ముద్దు గుమ్మవు
మా ఇంటి కోవెలవు చక్కని నెలవంకవు

మా ఊహల ఊయలలో ఊగే పసిపాపవు
మా మనసు లోగిళ్లో మా కనుపాపవు

నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి నువ్వు
సాన్వి ఓ ఓ సాన్వి హాపీ హాపీ బర్త్ డే //2//


చరణం 3:

ఎన్నెన్నో రంగులు, సరికొత్త హంగులు
ఎన్నెన్నో మలుపులు, నీ గెలుపులే గమ్యాలు

ప్రతీ క్షణంలో నీ ప్రయాణం సాగిపోవాలి
ప్రతీ అడుగులో విజయమే నిన్ను చేరాలి

పుట్టిన రోజు జేజేలు ఓ మా సాన్వి
పుట్టిన రోజు జేజేలు రా మా సాన్వి

ఇంతే ఇంతే ఇంతే…
ఎదుగుతూ మరి కొంతే
మా ఇంటి దేవతవై
నీకు ఎన్నో ఎన్నెన్నో హ్యాపీ బర్త్‌డేలు 

నిండు నూరేళ్లు వర్ధిల్లురా బంగారు