Saturday, 10 December 2016

విష్ నెం :15

ఆటగాడు
కేటుగాడు
వీడు మాయదారి మల్లిగాడు

అల్లరోడు
అందగాడు
వీడు చిత్రంగా ఉంటాడు

గుండు సూదిలా గుచ్చుతుంటాడు
మండే ఎండలా మండుతుంటాడు
మంచుకొండలా కరిగిపోతాడు
మల్లెమనసునే తీసుకువస్తాడు


పిచ్చివాడు కాదు
కాస్త పైత్యం ఉన్నోడు
చెడు ఎదురైతే చిచ్చరపిడుగు వీడు

అవసరానికి రాడు
నీ ఆత్మ బంధువు వీడు
మంచిగా పిలిస్తే పసిబాలుడే వీడు


ఎన్నో  పరిశీలనలు చేస్తూ ఉంటాడు
ముఖపుస్తకంలో ముభావంగా ఉంటాడు
చేదోడు - వాదోడుగా ఉంటాడు
తనకు నచ్చిందే చేస్కుంటూ పోతాడు


చాకులాంటి వాడు
గొప్ప ఛలోక్తి వీడు
చరిత్రలతో నీకు చుక్కెదురే వీడు


అందరిలా కాడు
కొంచెం చాదస్తం వీడు
సరిగ్గా చూసావో నీకే నచ్చుతాడు


అభిమానంతో నీ ఆట కడతాడు
ప్రేమంటే  తనలాగే అంటాడు
అన్ని  స్నేహాలలో వాడే ఉంటాడు
నీ మనసుకి దగ్గరగా ఉంటాడు

వేమూరి మల్లిగాడు
మంత్రాలకు లొంగనోడు
ముత్యమల్లే మెరుస్తూ ఉంటాడు

వెటకారం జోలికి పోడు
మమకారం లేకుండా రాడు
హాస్య చతురత కలిగిన సుందరుడు

// గరిమెళ్ళ గమనాలు // 10. 12. 2016 //











Wednesday, 7 December 2016

విష్ నెం :14
** సుజాతనీయం ***

 సుజాతమ్మ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలతో నా చిరు కవనీయం


రమణీయం
కమనీయం
సుజాతనీయం ......

ఆనందనీయం
ఆత్మీయం
సుజాతనీయం .......

అనుబంధనీయం
కనువిందునీయం
సుజాతనీయం .......

ఆహ్లాదనీయం
అనురాగమయం
సుజాతనీయం .........

సుందరనీయం
ధరహాసనీయం
సుజాతనీయం ......

భవనీయం
శ్రవణీయం
సుజాతనీయం ......

కోమలం
కరుణం
తేజోమయం
సుజాతనీయం ......



అమ్మ
అమ్మమ్మ
ముద్దుల సుజాతమ్మ
నాకు మాతృమణిరూపం
ఈ సుజాతనీయం ......

ఇట్లు
మీ పద్మ -ప్రసాదు
(శ్రీ రాజేంద్రుడు )