Monday, 3 April 2017

విష్ నెం :21
* శ్రీ సజ్జా కిషోర్ బాబు *




నడిచే నాయకుడు 
పనిచేసే శ్రామికుడు (24x 7)

కొండలతో సేధ్యం చేసే 
శ్రీ బలరామకృష్ణుడు 

మడమతిప్పని మేధస్సు 
చిరునవ్వుతో కన్పించే తేజస్సు 
ఆయనతోనే కోటి కాంతుల ఉషస్సు 

సామాన్యుడిగా పుట్టి 
చరిత్రలోకి అడుగుపెట్టిన (సృష్టించిన)
మన పవర్ మెక్ కంపెనీ అధినేత
ఎన్నో కుటుంబాలకు ఆయనొక చేయూత 
కష్టంలో ఉన్నవారికి ఆయన ప్రాణదాత 

రాజీ పడని తత్వం ఆయన ప్రత్యేకం 
పోటీ పడమంటుంది  ఆయన మనస్తత్వం 
అభివృద్ధిగా నిలుస్తుంది ఆయన వారసత్వం 

అడుగు అడుగులో ఆయన కష్టార్జితం 
అంచెలంచెలుగా ఆయన సంస్థల రూపాంతరం 
ప్రతీ ఎదుగుదలలో ఎన్నో అవాంతరాలు
కృంగిపోని ఆత్మస్థైర్యం తో అందుకున్న విజయాలు 

అనతికాలంలోనే  సాధించిన అవార్డులు 
మనిషి నుంచి మహామనిషిగా ఆయన సిద్దాంతాలు 

ఆయనకు ఆయనే ఒక భగవద్గీత 
మార్గదర్శకంగా నిలచే ఆయన భాట 

ఆయనే శ్రీమాన్ శ్రీ సజ్జా కిశోర్ బాబు 








Monday, 20 February 2017

విష్ నెం :20

విష్ నెం  :20

ప్రియమైన అన్నయ్య కి
పుట్టిన రోజు శుభాకాంక్షలు తో

నా చిన్న కవితా నజరానా .....

మృదు మధురం నీ హృదయం
ఆత్మీయతను అందించే  నీ కరచాలనం
ప్రశాంతతను చూపే నీ ముఖబింబం
మంచినే చెయ్యాలి
మంచినే పంచాలి అనే నీ స్వభావం
ఓపికతో సాధించే సుగుణం
నేర్పుగా కొనసాగే నీ జీవితం 
Well educated
Well Performer
Well good caring person

My Lovely Brother

@ WISH you a very happy birthday @







Sunday, 5 February 2017

విష్ నెం :19

విష్ నెం :19

వయసు చూస్తే 26
మనిషి చూస్తే మూడు మూరలు 
మరీ అంత పొట్టి కాదు కాని 
ఉంటాడులే 5 అడుగులు 
కళ్ళజోడు ఒకటి పెట్టి 
నేనే ''శివ కుమార్ '' అంటాడు 
శివ సినిమాలో నాగార్జున లాగా 
గొడవలేమి పెట్టుకుడులే 
కాని కదిలిస్తే బి. పి తో పడిపోతాడు 
అదేలేండి కదిలించిన వారిపై కాదు 
కళ్లు తిరిగి కింద పడి పోతాడని అర్ధం 

అమలాపురం పిల్లవాడు 
ఇంట్లో పెద్దవాడే 
కాని వాడ్ని చూస్తే అలా కనిపించడు 
అలా అని అమాయకుడు అనుకోకండి 
అమ్మాయిలతో భలే కబుర్లాడతాడు 
నవ్వడంటే షోడా కొట్టినట్టు 
నడిచాడంటే తాటాకులు పేలినట్టు 

షెటిల్ కూడా ఆడతాడండోయ్ 
కాకపొతే కష్టపడి ఆడాలి 
వీడి ఇంటిపేరు ''దున బోయిన ''
మరి ఏమి పోయిందో ఏమో 

మాటలో మంచి , మర్యాద ఉంటుంది 
గుప్పేదంతా భయం కూడా ఉందిలే 
ఎవ్వరి జోలికి గమ్మున పోడు 
అందరికీ మంచి జతగాడు , స్నేహితుడు 

Wednesday, 1 February 2017

విష్ నెం :18

ఆనంద్ .....


అనుకోకుండా ఒకరోజు
సాహితీ సమ్మేళన ప్రయాణంలో
పరిచయం .....

అనుకోలేదు ఈరోజు
ఇలా తనతో నా స్నేహం
ప్రయాణం చేస్తుందని ....


నేను చాలను
అతని భావాల ముందు ...
అతని పాటల సారాగాలనందు
అతని సాహితీ అనుభవంనందు


ఎంతో అణుకువ
ఎంతో అభిమానం
ఎంతో నిర్మలత
ఇతనిలో ....


నవ్వుతూ మాట్లాడే స్వభావం
నలుగురిలో చూపించే నిరాడంబరం
సాయమడిగితే వెనుకాడని మనస్తత్వం
ఎందుకు అంత గొప్పగా కనపడతాడంటే
అంతలా దీక్షగా పనిచేసే కృషీవలుడు


అక్షరాలతో మాటలు చెప్తాడు
మౌన రాగాలతో పాటలు పూయిస్తాడు
ఎప్పుడూ ఎదో ఒక ఆల్బమ్ చేస్తూనే ఉంటాడు
కొత్తగా యాంకరింగ్ లో దూసుకుపోతున్నాడు


మంచి మనిషి
మంచి స్నేహం
ఆనంద్ ....

''జన్మదిన శుభాకాంక్షలు ---మిత్రమా ""





Friday, 27 January 2017

విష్ నెం :17

విష్ నెం :17

నిధి కి నీరాజనం

శ్రీ గుఱ్ఱం వెంకటేశ్వరరావు మరియు శ్రీమతి స్వర్ణ శ్రీ గార్ల
ముద్దుల గారాల పుత్రిక ' నిధి '

నాట్యం నటరాజురూపం
అది అద్భుతంగా ప్రదర్శించగలగటం ఒక వరం
అది మన 'నిధి ' తల్లికి దక్కిన ఒక వైభవం

చక్కటి హావ భావాలతో
పరిపూర్ణమైన అభినయంతో
ఎన్నో ప్రదర్శినలు ... పలుమార్లు .. పలుచోట్ల ఇచ్చి
ఎంతో మంది మన్ననలు , ఆశీస్సులు పొంది
పిన్న వయ్యస్సులోనే పెక్కు అవార్డులను ,రికార్డులను గ్రహించి
ప్రపంచ ఖ్యాతి పొందిన ఈ చిన్నారికి చిరు అభినందనం

ముఖ్యంగా ఈ చిన్నారి విరామం లేకుండా
ఒకేసారి 21 లాలి పాటలను ప్రదర్శించి
14 ''వరల్డ్ రికార్డ్స్ '' ను సొంతం చేసుకోవటం తో పాటు
గౌ //శ్రీ //సి . నారాయణ రెడ్డి గారిచే ''లాలి నిధి '' అని బిరుదు గావించింది
అలానే 49 వివిధ రకాల  అవార్డ్స్ ఈమె ఖాతాలో చేర్చబడినవి
అందం , అభినయం తో పాటు అభ్యాసం లో కూడా
మన 'నిధి' సరస్వతి దేవి వారసురాలు.

పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్ట్టు
నిధి తన యొక్క ప్రతిభా సంపత్తిని
నిరంతరం  అభిలషిస్తూ , ఎన్నో శిఖరాలను అధిరోహిస్తూ
పట్టుదలతో , కార్య దీక్షతో పేరుకు తగ్గట్టుగా
తన అవార్డుల - రికార్డుల నిధులను కొల్లగొడుతూ
ఈ సమాజానికి ఒక బాల తేజమై ఉద్బవిస్తూ
తన సేవలను కొనసాగిస్తున్న సందర్భంగా

మా ''తెలంగాణా పద్మశాలి వెల్ పేర్ ట్రస్ట్ '' తరపున
ఈ తెలంగాణా బంగారు తల్లికి
మేమందించే ఈ సన్మాన ప్రశంసా పత్రం

అభినందనలతో
.........













Monday, 16 January 2017

విష్ నెం :16

విష్ నెం :16

ఆయుష్మాన్ భవ !
శతాయిష్మాన్ భవ !

నీ ఉత్సాహం తేజోమయమై
నీ ఉల్లాసం కాంతిపుంజమై
నీ యవ్వనం  ఒక సంకల్పమై
నీ ప్రతి కార్యం ఒక విజయపతంగమై
నీ విజ్ఞానసంపద ఒక నూతన తేజమై
నీ ఆనందం ఒక ఆహ్లాదపు కెరటమై
నీ తల్లి తండ్రులకు నీవు ప్రియ పుత్రుడవై
నీ  గురువులకు నీవు ప్రియ శిష్యుడవై
నీ స్నేహితులకు నీవు దిక్సూచివై

భవిష్యత్తులో ఒక  రాకుమారుడులా
నీ భవితను సువిశాలంగా విస్తరింపచేస్తూ
విక్రమార్కుడువై , వినోద్ వై
నువ్వెంత ఎదిగినా   మా అందరి హృదయాలలో
చిన్ని రామోజీ వై ,చిరకాలం చిరంజీవిగా వర్దిల్లమని
నీ జన్మ దిన శుభ సందర్బంగా శుభాశీస్సులు తెలుపు
మా హృదయ మందార దీవెనలతో

నీ అత్తా -  మామ
(  రాజా -పద్మ )