Friday, 27 July 2018


భవ్యమైన బంగారు భవిష్యత్తు
నీకు భవ్యంగా కలిసిరావాలని
దిగ్విజయంగా నీ కెరీర్లో
దివ్యంగా ముందుకు సాగాలనీ
అవరోధాల వంతెనలు దాటుతూ
ఆనందపు రెక్కలతో విహరిస్తూ
కల్మషంలేని మనసుతో
ఎప్పుడూ కనిపించే చిరునవ్వుతో
ఆయురారోగ్యాలతో , అష్టైశ్వర్యాలతో
అందంగా నీ జీవితాన్ని కొనసాగించాలని
కోరుకుంటూ , నీకు అభినందలు అందచేస్తూ

ప్రేమతో ....
పుట్టినరోజు మహోత్సవ శుభాకాంక్షలు ''భవ్య ''

Saturday, 28 April 2018

హాయ్ నాన్న

నా గురించి ప్రతీ క్షణం గుర్తుపెట్టుకుంటావ్
''స్వీట్ మెమోరీస్ '' ని ''స్వీట్ డేస్ '' గా గుర్తు చేస్తావ్
నా మతి - శ్రీమతి -బహుమతి నీవు
యుక్తిగానే చెప్తున్నాను ఇది అతిశయోక్తి కాదు
నేను నీపై ప్రేమను చూపించగల్నేమో
కాని నువ్వు నా ప్రేమను నీ ప్రేమగా ప్రేమతో అందిస్తావు
బాధించే క్షణాలు ఎన్నో వచ్చినా ...
నా నవ్వుతో నీ చిరునవ్వు కలిపి
నా సంతోషంలో నీ ధైర్యం నింపి  నన్ను నడిపిస్తావు
నాలో భాగమై ఉంటూ , నా రూపాన్ని నీలో దాచుకున్నావు
అందమైనా - బంధమైనా అది ముమ్మాటికి నువ్వే
ఏడడుగులు నడిచామో గానీ ఏడేడు జన్మలకు తోడుగా ఉందాం
సింపుల్ గా ఉంటావు - సూపర్ అనిపిస్తావు
నా గెలుపు తలుపు నీవు - నా వలపు మలుపు నీవు
నా చెలి నెచ్చెలి నీవు - నా ప్రేయసి రాక్షసి నీవు
ఓ శ్రీ నీకు నా  ఆశీస్సులతో ''జన్మదిన శుభాకాంక్షలు ''

Friday, 13 April 2018


సుదమ్మ -గోపీ నాన్నల ఏకైక ఏంజిల్ 
మురళీ పెదనాన్న - మధు అమ్మ ల ముద్దుల రాస్కెల్ 
రాజా బాబాయ్ - శ్రీ పద్మ చిన్నమ్మల గారాల డార్లింగ్ 
అమ్మమ్మ - తాతయ్యలకు నువ్వే హల్ చల్ 
ఎవ్వరైనా నీ చక్కిలిగింతలకు అవుతారు గిల్ గిల్ 
నీ పట్టీలతో తిరుగుతావు ఇల్లంతా ఘల్ ఘల్ 
నీ మాటలతో మ్యాజిక్ చేస్తావు జిల్ జిల్ 
నువ్వుంటే పండుగే అందరికీ ఫీల్ ఫీల్ 
నీ అల్లరితో మా ఆనందం ఎంతో ఫుల్ 
నీకెప్పటికీ కలగబోదులే డల్ డల్ 
నీకు నిండు నూరేళ్లు ఉండాలి మా బ్లెస్సింగ్స్
నువ్వు చెంత లేని రోజంతా మాకు బోర్ బోర్ 
'సాన్వి ' నీ పేరు లో ఉంది ఏదో లవ్లీ పవర్ 
నువ్వే మా అందరికీ గుండెచప్పుడు మై డియర్ 
ఓ రాక్షసి అందుకో ''హ్యాపీ బర్తడే '' యార్