నాకు మాత్రమే కాదు అందరికీ బంధువయ
మీ అభిమానం మంచుపూల వర్షం
నేనెన్నడు చూడలేదు నీ కళ్లలో క్రోధం
అక్షరం నిర్భయంగా బ్రతుకుతుంది నీ నీడలో
తెలుగుభాష వికసిస్తుంది నీ సంరక్షణలో
ఎంతమంది గొప్ప గొప్ప వ్యక్తులున్నా
నే చూసిన మహోన్నతమైన వ్యక్తిత్వం నీవు
స్వామి వివేకానందలా ఉంటుంది నీ వాక్చాతుర్యం
మీ మాటలు వింటుంటే మాలో ఏదో నవ చైతన్యం
శ్రీకృష్ణునిలా హితబోధ చేయగలవు
మా కర్తవ్యాలని "రధసారధిలా" మోస్తుంటావు
నిండు జాబిలిలా వెన్నెల కురిపిస్తావు
నీవున్న చోట పండగనే తలపిస్తావు
అశేష పట్టుదల, కృషిలో విక్రమార్కుడవు
అంచెలంచెలుగా ఎదిగిన తెలుగుతల్లి బిడ్డవు
నిన్ను చూసి ఈ నేల పునీతమౌతుంది
నీ ఖ్యాతి చూసి గగనమే స్వాగతమంటుంది
రాయలసీమలో ఉద్బవించిన నేటి మేటి రత్నానివి
అన్ని ఆహ్వానాలను సమానంగా గౌరవించే "కళారత్నా "నివి
తెలుగుసాహితీ వనంలో యువకెరటానివి
తెలుగు వెలుగొందుటకే సాక్షాత్కరించిన రక్షకుడువి
తెలుగు కనపడాలి -తెలుగు వినపడాలి అనే నినాదంతో
ప్రపంచవ్యాప్తంగా సాహితీ సదస్సులు నిర్వహించి
ఎందరెందరో కవులను, కళాకారులను ప్రోత్సహిస్తూ
విశ్వవ్యాప్తంగా తెలుగు భాష ఔనత్యాన్ని సగర్వంగా
చాటి చెప్పిన యుగ పురుషుడివి
పిన్నవయసులోనే విశిష్టమైన అవార్డులనందుకుని
అనతికాలంలోనే అధికార భాష సంఘం అధ్యకుడిగా మెప్పు పొంది
తెలుగు వారందరి గుండెల్లో అభిమానాన్ని సంపాదించిన ఓ హరికృష్ణుడా జయహో
మీ బాట ఎంతోమందికి ఆదర్శం
మీ మాట ఎంతోమందికి ఆచరణీయం
అందరికీ ఆత్మీయుడుగా
మన అమ్మ భాష వారసుడుగా
తరతరాలకి మీరు చేసిన సేవలకు ప్రత్యుపకారంగా
తెలుగు తనానికి, తెలుగు రక్షణ కి
ఎందరో, మరెందరో మీ లాంటి నిత్య కృషీవలురుగా
తయారవ్వాలని, ఆ భగవంతుడు మీకు అష్ట సిద్ది ఐశ్వర్యాలతో పాటు, మంచి ఆరోగ్యం ఇచ్చి
ఎన్నెన్నో విజయ బావుటాలు ఎగరవేయాలని కాంక్షిస్తూ "జన్మదిన మహోత్సవ శుభాకాంక్షలు "
- మీ సేవకుడు, మీ సోదరుడు
(గరిమెళ్ళ )