Wednesday, 14 October 2015

విష్ నెం :10


మన ప్రపంచ తెలుగు కవితోత్సవం గురించి నేను రాసిన చిన్న కవిత
**************************************************************

ప్రతి కవులందరికీ
ప్రతి కవయిత్రులకీ
అందిన కవితోత్సవ ఆహ్వానం

ప్రతి ప్రాంతం నుంచి
ప్రతి జిల్లా నుంచి
ప్రతి రాష్ట్రం నుంచి
ప్రపంచాన్నే వేదికగా చేసి
తరలి వస్తున్న కవి హృదయాలకు వందనం

మాహా యజ్ఞమే ఈ ఉత్సవం
నిర్వాహకులకు పరీక్ష సమయం
తోడుండాలి ఒకటై మన సైన్యం

చీకు చింతా వదిలెయ్యండి
హాయిని పిలిచి తరలిరండి
మీరంతా కలిస్తే ఇది ''రికార్డ్ '' అండి

ఎన్నో మైళ్ళ దూరం నుంచి
ఎన్నో ప్రణాళికలే రూపొందించి
కొత్త ఆశయానికే సంకల్పం చేసి
మీకోసం ,మన కోసం ... మన అందరికోసం
''ప్రపంచ తెలుగు కవితోత్సవం ''
ఇది ''ప్రపంచ తెలుగు కవితోత్సవం ''


స్వాగతం - సుస్వాగతం
ప్రతి కవి గుండెకి ఘన స్వాగతం

అక్షరం - కవితాక్షరం
కొన్ని గంటల నిరంతర గానం

ముఖచిత్రంతో పరిచయం
కొన్ని సమూహాలతో ఈ కార్యక్రమం

అంతర్వేది నరసింహుని సన్నిధిలో
మొట్ట మొదటిసారిగా దీక్షకు పూనిన
రెండు రోజుల పండుగగా సాగే
''ప్రపంచ తెలుగు కవితోత్సవం ''
ఇది ''ప్రపంచ తెలుగు కవితోత్సవం ''


మంచి సాహిత్యం రావాలి
మన అక్షరం ఎదగాలి
కవులకు /కవయిత్రులకు ఇది ఒక ఆసరా
ఒక మంచి సహృదయ సంకల్పం
ఎంతో ప్రయాసతో కూడుకున్న కార్యక్రమం
నిలిచిపోవాలి మన ఈ మహోత్సవం
గుర్తుండి పోవాలి ప్రతి మదిలో ఈ భావం
''ప్రపంచ తెలుగు కవితోత్సవం ''
ఇది ''ప్రపంచ తెలుగు కవితోత్సవం ''