Sunday, 7 July 2024

చిట్టి తల్లి -Happy Birthday

నీ పలకరింపులతో నా దినచర్య ప్రారంభం
నీ అడుగుల సవ్వడులే నాకు ఆనందం

చిరునవ్వులు చిందించే చిద్విలాస రూపం
నీ చిట్టి చిట్టి చేష్టలే మాకు అపురూపం

ఇంద్రభవనాన్ని తలపించే మా ఆవరణం
బుజ్జి మహాలక్ష్మియే మాకు నీ సోయగం

కిల కిలా నువ్వు కబుర్లెన్నో చెప్తుంటే
అలా అలా నీ ముత్యపు మాటలు వింటుంటే
సమయమే మెరిసిపోయే
నా అలసటను నేనే మరచిపోయే

నీ కలివిడితనంతో కలిసిపోయే బంధాలు
నీ ఆలోచన సరళిలో ఎన్నో ప్రేమానురాగాలు
మా అందరికీ అమ్మవు -చిట్టితల్లివి నీవు
మా కలల రాణివి-కల్పవల్లివి నీవు

చిన్నితల్లి నీ ప్రేమెంతో మధురం
నీవు చూపించే ఆప్యాయత అతి మధురం
నీ అల్లరిచేసే గారం మధురం
నీ అలకలలో మారం మధురం

నీతో అందమైన జీవితం మా అదృష్టం
మంచి భవిష్యత్తు కావాలి నీ సొంతం
మా ఆశా కిరణం నీవమ్మా
మంచి ఆశయాలతో ముందుకు సాగిపోమ్మా
బంగారు తల్లి “పుట్టిన రోజు శుభాకాంక్షలు”
లేక్షణ తల్లి నీ నవ్వులే మా వెలుగులు
వర్ధిల్లాలి నీవు నిండు నూరేళ్లు

ప్రేమతో 
నాన్న

Friday, 5 July 2024

HB 2 Lekshna (Akshara Koumudi)

చిట్టి తల్లికి జన్మ దినోత్సవ శుభాకాంక్షలు శుభాశీస్సులు


 మా కోటి ఆశల మణి దీపం

 మా అపురూప శిల్పం

మా ముంగిట్లో విరిసిన చిద్విలాస స్వరూపం


శరత్కాల వన్నెల చిన్నారివి పొన్నారివి 

చిట్టి సొగసుల వయ్యారి

మా మేనులతల పసిడి కాంతులువిరజిమ్మే లేక్షణ


మా నిరీక్షణ అమృత ఫలం నీవు

జన్మజన్మల అనుబంధమై 

అమ్మానాన్నల ప్రేమ సంకేతమై 

మా కనుల కాచు అపురూప రూపం నీవే

కమ్మనైనా నీ పిలుపే మాకు మాధుర్యమై

నీ చిరునవ్వుల జల్లులు  పులకింతలై 

ప్రేమామృత వర్షిణి వై 

మా రాగాల అనురాగాల జావడిలో 

విలక్షణమైన సౌందర్య లహరి వై

లేక్షనీయమైన నీ నవ్వే చాలురా   చిట్టి తల్లి

బుడి బుడి అడుగులతో ముద్దు ముద్దు పలుకులతో  వాణీ వై మా ఇంటి మహారాణి వై రావే సిరి మహాలక్ష్మి వై

మా ఎదలు ఉప్పొంగంగా ఉత్కర్షిణి వై 

మా ఆనంద డోలికల్లో

నీ రూపం అపురూపమై

మా అదృష్ట సిరి తారవు నువ్వేరా లేక్షణా 

జ్ఞాన విజ్ఞాన సమపార్జన లో రాణిస్తూ

ఎదగాలి ఇంతకు ఇంతై 

పేరు ప్రఖ్యాతలు గడిస్తూ 

మా మమతల కోవెల లో ఆమని వై వెలుగొందురా తల్లి

మా హృదయానంద కల్పవల్లి

చిరంజీవి లెక్షణ అందుకోరా 

అమ్మానాన్న దీవెనలు 

ఇలాగే నిత్యం నవ్వుతూ నవ్విస్తూ శతాధిక జన్మ దినోత్సవ వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆశీర్వదిస్తూ 

ఆశీస్సుల అక్షర కుసుమాలు  ఆందుకోరా లేక్షణ 💐💐.

ఇట్లు 

అమ్మ నాన్న

HB 2 Lekshna

 ఆకాశ దీపం

అపురూప శిల్పం

మా ముంగిట్లో

వెలసిన బుజ్జి మహాలక్ష్మి


అందమైన వన్నెల చిన్నారి

చిట్టి సొగసుల వయ్యారి

కోరుకున్నాం అనుకుంటా

నిన్నే ఏరి కోరి బంగారి


అమాంతం కట్టి పడేసే నీరూపం

అమ్మానాన్నలకు అది ప్రతిరూపం

నువ్వే మా కనులరూపం

కమ్మనైనా నీపిలుపే మాకు అమృతం


వరాల జల్లుల చిన్ని కిన్నెర

లేక్షనీయమైనా నీ నవ్వే చాలురా

బుడి బుడి అడుగులతో రారా

చిన్ని కన్నా మా అదృష్టం నువ్వేరా


ఇంతలోనే ఎంతజ్ఞానమురా తల్లి
అంచెలంచెలుగా ఎదగాలిరా తల్లి
మా తల్లివి నీవు
మా పిల్లవి నీవు

అందుకోరా 
హ్యపీ హ్యాపీ బర్త్ డే లు
నీకు శతకోటి శతాయిష్మాన్ భవ
జన్మదిన శుభాకాంక్షలు

Monday, 15 April 2024

HAPPY BIRTHDAY - MY LOVE

ఓయ్ ఏమి చేస్తున్నావు

ఏటు చూస్తున్నావ్ 

ఇక్కడ చూడు


ముందుగా 

నా ప్రియమైన శ్రీమతికి ప్రేమతో పుట్టినరోజు శుభాకాంక్షలు 


నీకు జన్మదిన శుభాకాంక్షలు ఎంతో విభిన్నంగా చెప్పాలని

అందమైన వాక్యాలను వెతుకుతూ

ఏమీ దొరక్క ఇదిగో ఇల చెబుతున్నా


ఎంతో అందమైన లోకం

అందులోన నువ్వు అధ్బుతం 

నీతో జతపడి సాగుతున్న జీవితం

ఎన్ని జన్మాలకైనా నీకే అంకితం



Wednesday, 17 January 2024

జన్మదిన మహోత్సవ శుభాకాంక్షలు - ప్రతాప్ సార్

 

జన్మదిన మహోత్సవ శుభాకాంక్షలు - ప్రతాప్ సార్

ఆత్మీయ మిత్రులు

అందరికీ సన్నిహితులు

సామన్యుల నుండి అసామాన్యంగా 

ఎదిగిన కవి వీర ప్రతాపులు

ప్రముఖ కవి ,సినీ గేయ రచయిత

డాక్టరేట్ అవార్డ్ గ్రహీత

కవి భూషణ్ ,సాహిత్య భూషణ్

సాహిత్య రత్న ,కళా రత్న

అక్షర తపస్వి ,సాహితీ పిపాసి

అపర భగీరధుడు

పట్టువదలని విక్రమార్కుడు 

అక్షరానికి అండ మా కత్తిమండ ప్రతాప్ సార్

కవిత్వంలో మండే కలం మా కత్తిమండ ప్రతాప్ సార్

నవ యుగ సాహిత్య చక్రవర్తి

అభినవ శ్రీ కృష్ణ దేవరాయులు

ఎందరో కవులకు ,కళాకారులకు మార్గదర్శి

వందలాది అవార్డులు ఆయన సొంతం

తనకుతానే తిరిగిరాసుకున్న రికార్డులు ఆయన కైవసం

చరిత్రను సృష్టించాలన్నా ,దాన్ని తిరగరాయాలన్న ఆయనకే సాధ్యం

ఆయనే శ్రీమాన్ -మా శ్రీ శ్రీ కళావేదిక చైర్మన్

ప్రపంచ తెలుగు సాహిత్య సాంస్కృతిక అకాడమీ చైర్మన్

సాహిత్య అకాడమి పూర్వ సభ్యులు (AP)

బోయి భీమన్న కవి ప్రభుత్వ పురస్కార గ్రహీత

గుర్రం జాషువా ప్రభుత్వ పురస్కార గ్రహీత

ప్రభుత్వ ఉగాది పురస్కార గ్రహీత

ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత


శ్రీ డా.కత్తిమండ ప్రతాప్ గారు

మీ పుట్టిన రోజు సంధర్భంగా 

అందుకోండి మా నీరాజనాలు

మీరు చూడనివి అపజయాలు

మీ మార్గాలే విజయ సోపానాలు


జయహో అక్షరం

జయహో కవిత్వం

జయహో ప్రతాప్ సార్