చిట్టి తల్లికి జన్మ దినోత్సవ శుభాకాంక్షలు శుభాశీస్సులు
మా కోటి ఆశల మణి దీపం
మా అపురూప శిల్పం
మా ముంగిట్లో విరిసిన చిద్విలాస స్వరూపం
శరత్కాల వన్నెల చిన్నారివి పొన్నారివి
చిట్టి సొగసుల వయ్యారి
మా మేనులతల పసిడి కాంతులువిరజిమ్మే లేక్షణ
మా నిరీక్షణ అమృత ఫలం నీవు
జన్మజన్మల అనుబంధమై
అమ్మానాన్నల ప్రేమ సంకేతమై
మా కనుల కాచు అపురూప రూపం నీవే
కమ్మనైనా నీ పిలుపే మాకు మాధుర్యమై
నీ చిరునవ్వుల జల్లులు పులకింతలై
ప్రేమామృత వర్షిణి వై
మా రాగాల అనురాగాల జావడిలో
విలక్షణమైన సౌందర్య లహరి వై
లేక్షనీయమైన నీ నవ్వే చాలురా చిట్టి తల్లి
బుడి బుడి అడుగులతో ముద్దు ముద్దు పలుకులతో వాణీ వై మా ఇంటి మహారాణి వై రావే సిరి మహాలక్ష్మి వై
మా ఎదలు ఉప్పొంగంగా ఉత్కర్షిణి వై
మా ఆనంద డోలికల్లో
నీ రూపం అపురూపమై
మా అదృష్ట సిరి తారవు నువ్వేరా లేక్షణా
జ్ఞాన విజ్ఞాన సమపార్జన లో రాణిస్తూ
ఎదగాలి ఇంతకు ఇంతై
పేరు ప్రఖ్యాతలు గడిస్తూ
మా మమతల కోవెల లో ఆమని వై వెలుగొందురా తల్లి
మా హృదయానంద కల్పవల్లి
చిరంజీవి లెక్షణ అందుకోరా
అమ్మానాన్న దీవెనలు
ఇలాగే నిత్యం నవ్వుతూ నవ్విస్తూ శతాధిక జన్మ దినోత్సవ వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆశీర్వదిస్తూ
ఆశీస్సుల అక్షర కుసుమాలు ఆందుకోరా లేక్షణ 💐💐.
ఇట్లు
అమ్మ నాన్న
No comments:
Post a Comment