Sunday, 5 February 2017

విష్ నెం :19

విష్ నెం :19

వయసు చూస్తే 26
మనిషి చూస్తే మూడు మూరలు 
మరీ అంత పొట్టి కాదు కాని 
ఉంటాడులే 5 అడుగులు 
కళ్ళజోడు ఒకటి పెట్టి 
నేనే ''శివ కుమార్ '' అంటాడు 
శివ సినిమాలో నాగార్జున లాగా 
గొడవలేమి పెట్టుకుడులే 
కాని కదిలిస్తే బి. పి తో పడిపోతాడు 
అదేలేండి కదిలించిన వారిపై కాదు 
కళ్లు తిరిగి కింద పడి పోతాడని అర్ధం 

అమలాపురం పిల్లవాడు 
ఇంట్లో పెద్దవాడే 
కాని వాడ్ని చూస్తే అలా కనిపించడు 
అలా అని అమాయకుడు అనుకోకండి 
అమ్మాయిలతో భలే కబుర్లాడతాడు 
నవ్వడంటే షోడా కొట్టినట్టు 
నడిచాడంటే తాటాకులు పేలినట్టు 

షెటిల్ కూడా ఆడతాడండోయ్ 
కాకపొతే కష్టపడి ఆడాలి 
వీడి ఇంటిపేరు ''దున బోయిన ''
మరి ఏమి పోయిందో ఏమో 

మాటలో మంచి , మర్యాద ఉంటుంది 
గుప్పేదంతా భయం కూడా ఉందిలే 
ఎవ్వరి జోలికి గమ్మున పోడు 
అందరికీ మంచి జతగాడు , స్నేహితుడు 

No comments:

Post a Comment