Saturday, 6 December 2014

విష్ నెం :1 (సుజాతనీయం)

విష్ నెం :1
సుజలాం సుఫలం  సుందరం సుజాతం
అమ్మతనం ,ఆత్మీయఫలం ఆమె స్నేహం 
అందరి మనస్సులలో మెదిలే పారిజాతం
చిన్నలైన ,పెద్దలైనా అందరికీ ఆమె అంటే ఇష్టం
కుటుంబంలోనైనా ,వ్యక్తిత్వంలోనైనా  అమెకామే ఓ ప్రత్యేకం
ఆమెను చూస్తే చాలు చిరునవ్వు రైలులా ప్రయాణిస్తుంది
ఆమెచెంత ఉంటే చాలు అమ్మ తోటి ఉంటున్నట్టే అనిపిస్తుంది 
ఆమె పలుకు ఒక నూతన ఉత్తేజాన్ని ఇస్తుంది
ఆకాశమంత నిర్మలమైన హృదయం అమెది
నిరాడంబరత కల్గిన జీవితం నేటి మేటి ముత్యమైన సుజాతమ్మది
అందరినీ మెప్పించేను  ఆమె తీరు ,అందరికీ ఆదర్శనీయం ఆమె చిరునవ్వు
ఎవ్వరైనా  ఆమె స్నేహాన్ని కోరతారు ,ఒక బందువులా ఆమెని చూస్తారు
అందుకే ఆమె ఒక ఆత్మీయబందువురాలు మనందరికీ
ఆమె అనురాగం ,అప్యాయతలే మా లాంటి వారికి నిండు ఆశీస్సులు
అమ్మా మీరెప్పుడూ ఇలానే చల్లగా ,నిండు నూరేళ్ళు ,మంచి ఆరోగ్యంతో 
నిండు వెన్నెల లా వికసించాలని కోరుకుంటూ 
హృదయపూర్వక  జన్మదిన శుభాకాంక్షలు - మా సుజాతమ్మకు ,మీ సుజాతనీయంకు 
అద్బుత కళాఖండాలు మీ కలం నుండి జారే ఆణిముత్యాలు 
మీ సాహితీసంపద కూడా ఇలానే కొత్త చిగురులు పూస్తూ 
మమ్ములను పులకింపచేస్తూ ,ప్రోత్సహిస్తూ 
మీ కలం ముందు ముందుకు పోవాలని ఆకాంక్షిస్తూ 
మరోసారి మనస్పూర్తిగా పుట్టిన రోజు శుభాకాంక్షలు 

                                                                   ఇట్లు 
                                                                    మీ పద్మ -ప్రసాదు                         

                                                                  








No comments:

Post a Comment